రంగారెడ్డి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరువు కల్పించేలా పథకాలను అమలుచేస్తున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతన్నల ఖాతాల్లో ప్రతినెలా రూ.3 వేలు జమ చేసేలా నిర్ణయం తీసుకుని సాకారం చేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచే నేరుగా నగదు ను ప్రభుత్వం నేతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. చేనేత మిత్ర పథకంతో రంగారెడ్డి జిల్లాలో 872 కుటుంబాలకు ప్రయోజనం కలుగుతున్నది. ప్రభు త్వం చూపుతున్న ఆదరణపై నేతన్నల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
కార్మికుల జీవితాల్లో వెలుగులు..
నూలు పోగునే నమ్ముకుని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రంగురంగుల చీరలను ప్రపంచానికి అందించిన చేనేత బతుకులకు భరోసా కల్పించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తున్నది. త్రిఫ్ట్, చేనేత మిత్ర వంటి పథకాలు చేనేత కార్మిక కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. చేనేత కార్మికులు కొనుగోలు చేసిన నూలుపైన 50 శాతం సబ్సిడీ ఇచ్చి చేనేతమిత్ర పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నది. అయితే ఈ సబ్సిడీ కార్మికులకు సకాలం లో అందడంలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి నేత కార్మికులు తీసుకెళ్లగా.. జియో ట్యాగింగ్ అయిన ప్రతి మగ్గం కార్మికుడికి నెలకు రూ.3వేల చొప్పున జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తున్నది. ఈ సాయంలో రూ.2 వేలు యజమానికి, మిగతా రూ.వెయ్యి అతడి సహాయకుడికి అందజేస్తున్నది. ఈ లెక్కన జిల్లా లో 450 మంది యజమానులు, మరో 422 మంది సహాయకులకు సాయం అందనున్నది.
నేత కార్మికులకు ఇతోధిక సాయం..
జిల్లాలో సుమారు 800లకు పైగా చేనే త కుటుంబాలు మగ్గాలనే నమ్ముకుని జీవిస్తున్నాయి. ఆయా కుటుంబాలను వివిధ పథకాల ద్వారా ప్రభు త్వం ఇతోధికంగా ఆదుకుంటున్నది. రూ.లక్ష చేనేత రుణాలను ప్రభుత్వం మాఫీ చేయగా..జిల్లాలో 45 మంది చేనేత కార్మికులకు సంబంధించిన రుణాలు రూ.12,37,6 95 మాఫీ అయ్యాయి. క్లోజ్డ్ లోన్స్‌లో భాగంగా 19 మందికి సంబంధించిన రూ.5.70లక్ష లు మాఫీ అయ్యాయి. 2022-23 సంవత్సరానికి ముద్రలోను పథకం కింద 50 మంది చేనేత కార్మికులకు రూ.29 లక్షలు అందించేందుకు ప్రతిపాదనలు పంపగా.. అందులో 26 మందికి రూ.13లక్షల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి.
వికారాబాద్ జిల్లాలో 147 మందికి లబ్ధి
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 2 : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అం డగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత పరిశ్రమ నిరాదరణకు గురి కా గా కార్మికులు పనుల్లేక వలసలు వెళ్లేవారు. తెలంగాణ వచ్చిన తర్వాతే వారికి మహర్దశ వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ఆసరా పింఛన్లను కూడా అందిస్తున్నది. అంతేకాకుండా చేనేతమిత్ర పథకానికి మార్పులు చేసింది. దీనిద్వారా నేతన్నలకు ప్రతినెలా రూ.3వేల ఆర్థిక సాయం అందనున్నది. ఇప్పటివరకు చేనేతమిత్ర పథకం కింద నూలు, రసాయనాలు, ముడిసరుకుల కొనుగోలుకు చేనేత కార్మికులకు ప్రభుత్వం 50శాతం రాయితీని అందించేది. వివిధ కారణాల వల్ల సకాలంలో అందడంలేదు. ఈ నేపథ్యంలో నేతన్నలకు రాయితీ బదులుగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా రూ.3 వేల చొప్పున జమ చేస్తామని గత నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం నుంచి నేతన్న ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 147 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతున్నది. ప్రభుత్వ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాయితీ బదులుగా నెలకు రూ. 3 వేల చొప్పున..
నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటివరకు చేనేతమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద నూలు, రసాయనాలు, ముడి సరుకుల కొనుగోలుకు రాయితీ ఇస్తున్నది. అయితే రాయితీ పొందడం నేతన్నల కు ఇబ్బందిగా మారింది. జీఎస్టీ బిల్లులు, ఆన్లైన్లో దరఖాస్తు తదితర విధానాలతో రాయితీ పొందలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేసి రాయితీ బదులుగా నేతన్నలకు నేరుగా ప్రతినెలా రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించిం ది. ఈ విధానం వల్ల జియో ట్యాగింగ్ అయిన మగ్గం కార్మికుడికి నెలకు రూ.2 వేలు, సహాయకుడికి రూ.వెయ్యి చొప్పున అందనున్నాయి.
సీఎం కేసీఆర్ సల్లగుండాలే
గత ఉమ్మడి ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకోలేదు. దీంతో మేము పనుల్లేక ఇత ర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మాకు మంచి రోజులొ చ్చాయి. చేతినిండా పని దొరుకుతున్నది. ఇ ప్పుడు చేనేతమిత్ర పథకం ద్వారా ప్రతినెలా రూ.3 వేల చొప్పున మా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయించడం సంతోషకరం. ఇంతమంచి సీఎం సల్లగుండాలే.
-సత్యనారాయణ, ఉత్తమ చేనేత కార్మికుడు , ఆమనగల్లు
ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా..
ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి. సర్కారు సహాయం లేక కు టుంబ పరిస్థితులు దుర్భరంగా మారి పూట గడువడమే కష్టంగా ఉండేది. చేతిలో పనిలేక ఉపాధి కరువై అప్పుల పాలయ్యేవారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలో ఉమ్మడి రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. కానీ, పోరాడి సాధించుకు న్న తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న చర్యల తో నేతన్నల బతుకులు మారుతున్నాయి. నేతన్నలకు పొదుపు పథకం, ఆసరా పింఛన్లు, పా వలావడ్డీ రుణాలు, రుణమాఫీ, ఆధునిక యం త్రాల సరఫరా, బీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ ఆదుకుంటున్నది. దీంతో నేతన్నల మోముల్లో చిద్విలాసం కనిపిస్తున్నది.
నేతన్నల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న సాయం
ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 147 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతున్నది. శుక్రవారం వారి బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అవుతుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బషీరాబాద్‌లో ఎనిమిది మందికి, బొంరాస్‌పేటలో 15 మందికి, ధారూరులో ఒకరికి, దోమలో 8 మందికి, దౌల్తాబాద్‌లో 45 మందికి, కోట్‌పల్లిలో ముగ్గురి కి, కులకచర్లలో ఒకరికి, మర్పల్లిలో ముగ్గురికి, మోమిన్‌పేటలో ఇద్దరికి, నవాబ్‌పేటలో నలుగురికి, పరిగిలో ముగ్గురికి, పూడూరులో ఇద్దరికి, తాండూరులో ఇద్దరికి, వికారాబాద్‌లో నలుగురికి, యాలాలలో 32 మందికి, తాండూరు మున్సిపల్ పరిధిలో ముగ్గురికి, వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ముగ్గురికి, పరిగి మున్సిపల్ పరిధిలో ముగ్గురికి, కొడంగల్ మున్సిపల్ పరిధిలో ఐదుగురికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతున్నది.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల పక్షపాతి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం చేనేతమిత్ర పథ కం కింద చేనేత కార్మికుల బ్యాంకు ఖాతా ల్లో రూ.3 వేలు జమ చేయడం గొప్ప విష యం. ఇప్పటికే ప్రభుత్వం చేనేత కార్మికుల కు రూ.5 లక్షల చేనేత బీమా పథకంతోపా టు రూ.25 వేల హెల్త్ ఇన్సూరెన్స్‌నూ కల్పించింది. చేనేత కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం.
-గాజుల శ్రీనివాస్, చేనేత సహకార సంఘం మండలాధ్యక్షుడు, ఆమనగల్లు