ఊరంతా వేడుక
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
- భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు
- కార్యక్రమానికి హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్
- అర్చకులతో ప్రత్యేక పూజలు
- మూడు రోజుల పాటు జరుగనున్న సంబురాలు
వికారాబాద్, ఫిబ్రవరి 4 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆదివారం నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం స్థానిక కౌన్సిలర్లు దేవీరెడ్యానాయక్, జైదుపల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్పీకర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులు, ఒగ్గు కళాకారులు నృత్యాలు చేశారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు జరుపుకోనున్నారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్ దంపతులు హాజరై పూజలు చేశారు. గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ రాములమ్మ, కాలనీ పెద్దలు అనంతయ్య, బాగయ్య, రాజునాయక్, రెడ్డి శేఖర్, నర్సింహులు కాలనీ వాసులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

