ఇబ్రహీంపట్నం, జనవరి 6 : రైతులకు మార్కెటింగ్ సేవలు మరింత చేరువచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన పాలకవర్గం కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా ఎంపికైన పాలకవర్గం శుక్రవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, పలువురు డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్టీయూటీఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
ఎస్టీయూటీఎస్ ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్, డైరీని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి ఎల్వోసీ అందజేత
నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి చెందిన జ్యోత్స్న అనారోగ్యంతో నగరంలోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తక్షణ సహాయంగా ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు మంజూరు చేయించారు. అట్టి సీఎం సహాయనిధి ఎల్వోసీని క్యాంపు కార్యాలయంలో బాధితురాలి కుటుంబీకులకు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బలదేవ్రెడ్డి, బిందు రంగారెడ్డి, బాబు, ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులున్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన మహ్మద్ నాయిముద్దీన్కు రూ.28వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు రియాజుద్దీన్, ఉపసర్పంచ్ భగీరత్, నాయకులు పాల్గొన్నారు.
డ్రైనేజీని మూసీలో కలపండి
పెద్దఅంబర్‌పేట, జనవరి 6: జీహెచ్ఎంసీ పరిధిలోని డ్రైనేజీ నీళ్లు మున్సిపాలిటీ పరిధి పసుమాములలోని రాయన్ చెరువులో కలుపడంతో నీరు కలుషితమవుతున్నదని గ్రామ అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. డ్రైనేజీ నీళ్లు చెరువులో కలువకుండా అండర్‌గ్రౌండ్ పైపులైన్ ద్వారా నేరుగా మూసీలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. చెరువులో డ్రైనేజీ నీరు చేరుతుండటంతో దుర్వాసన వస్తున్నదని, దోమలు, ఈగలు పెరిగి స్థానికులు రోగాల బారినపడుతున్నారని వివరించారు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, శంకరయ్యగౌడ్, గౌని భాస్కర్‌గౌడ్, పాడి జంగయ్య, చెట్టి లింగం, సత్యనారాయణగౌడ్, గోవర్ధన ప్రవీణ్, వీరస్వామి, భాస్కర్‌గౌడ్, బాల్‌రాజ్, భిక్షపతి, రామలింగం, అప్పన్న, శేఖర్, నవీన్ తదితరులు ఉన్నారు.