తుర్కయాంజాల్, మార్చి 10 : అధికార కాంగ్రెస్ పార్టీ భూదాహనికి బలైపోతున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అభివృద్ధి పనుల పేరిట దళితులు, బీసీల భూములను తీసుకుంటున్న ప్రభుత్వం వారి కి తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములపై మీకు ఎలాంటి హక్కు లేదంటూ లాక్కుంటుండడంతో రైతులు ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తాజాగా ఆదిబట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధిలోని కొహెడ రెవెన్యూ సర్వేనంబర్ 167/1లో ఇంటిగ్రేటేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఏర్పాటు కోసం కొహెడకు చెందిన ఆగమయ్య అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నది. అందులో ఉన్న సొప్ప, జొన్న పంటలను రాత్రి సమయంలో తొలగించడంతో మంగళవారం రైతు ఆగమయ్య కొహెడ జేఏసీ నాయకులతో కలిసి సర్వేనంబర్ 167/1 ఆందోళన చేపట్టాడు. ఈ సందర్భం గా ఆగమయ్య మాట్లాడుతూ.. సుమారు 100 ఏండ్లుగా తమ కుటుంబం ఈ భూమినే సాగు చేసుకుంటూ జీవిస్తున్నదని.. అధికారు లు ఈ భూమిపై నీకు ఎలాంటి హక్కు లేదని చెప్పడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదన్నాడు. సోమవారం రెవెన్యూ అధికారు లు ఆ పొలంలో ఉన్న సొప్ప, జొన్న పంటలను తొలగించాలని చెప్పారని.. నాకు తెలియకుండానే అర్ధరాత్రి సమయంలో పొలంలో పంటలను మొత్తం తొలగించి చదు ను చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం కొహెడ జేఏసీ నాయకుడు కందాళ బలదేవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను
మాత్రమే బలవంతంగా లాక్కు
టున్నదని మండిపడ్డారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా కొహెడ సర్వేనంబర్ 167/1లోని భూముల్లో ప్రభుత్వం పనుల ను మొదలుపెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 100 ఏండ్లకుపైగా దళితులు, బీసీలు సాగు చేసుకుంటున్న సుమారు 266 ఎకరాలను ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి వల్లే కొహెడ రైతులకు తీవ్ర న ష్టం జరుగుతున్నదన్నారు. ఆయన ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తూ రైతుల భూ ములను లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
తహసీల్దార్ రైతులపై బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి తో కలిసి ఘటనాస్థలానికి చేరుకోని ఉన్నతస్థాయి కమిటీ వేయడం జరిగిందని.. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రైతులు మాత్రం వారి మాట వినకుండా పరిహారం ప్రకటించిన తర్వాతే భూమిని ఆధీనంలోకి తీసుకోవాలని తేల్చి చెప్పడంతో ఏమి లేక అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
కొహెడ సర్వేనంబర్ 167/1లోని నాలుగు ఎకరాల్లో మా తాతల కాలం నుంచే ఆ పొలాన్ని సాగు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు అధికారులు వచ్చి ఆ భూమిపై మాకు ఎలాంటి హక్కు, అధికారం లేదని చెబుతున్నారు. ప్రభు త్వం ఈ భూమిని తీసుకుంటుందని చెప్పడంతో తీవ్ర ఆందోళన కలిగింది. ప్రభు త్వం నాకున్న నాలుగు ఎకరాల భూమిని బలవంతంగా తీసుకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకోదారి లేదు.
-ఆగమయ్య, రైతు, కొహెడ