పంట దిగుబడిలో మొలక శాతం కీలకం
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైతులు విత్తనాల ఎంపికకు అధిక ప్రాధాన్యమివ్వాలి.
- గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి
- నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైతులు విత్తనాల ఎంపికకు అధిక ప్రాధాన్యమివ్వాలి. విత్తనం ఎంపికపైనే పంట దిగుబడి ఆధాపడి ఉంటుంది. నాణ్యమైన విత్తన రకాలు, వాటి వివరాలపై ప్రత్యేక కథనం.
బ్రీడర్ విత్తనం
ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పరవ్యేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు రూపొందించేవి ఇటువంటి విత్తనాలే. ఈ విత్తనం 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్‌కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర చాలా ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి బ్రీడర్ సీడ్ ఇవ్వరు.
సర్టిఫైడ్ విత్తనాలు
విత్తనం నుంచి నేరుగా సర్టిఫైడ్(ధ్రువీకరించిన) విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో కూడా విత్తన పర్యవేక్షకుల సమక్షంలో పండించే అవకాశం ఉంది. ఈ విత్తనానికి నీలిరంగు ట్యాగ్ వేస్తారు.
ట్రూత్పుల్ లేబుల్ ..
సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి చేసిన ఈ విత్తనాన్ని విత్తన ధ్రువీకరణ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ విత్తనాలను ట్రూత్పుల్ లేబుల్ కింద రైతులకు విక్రయిస్తుంటారు. ట్రూత్పుల్ లేబుల్ విత్తనానికి ఆకుపచ్చ రంగు ట్యాగ్ వేస్తారు. లేబుల్ ట్యాగ్‌పై విత్తన పరీక్ష చేసిన తేదీ ఉంటుంది. ఆ తేదీ నుంచి తొమ్మిది నెలల కాలపరిమితి లోపు విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు.
వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి
రైతులు పంటలకు అవసరమైన విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేసి రసీదును తప్పనిసరిగ్గా తీసుకోవాలి. ఒక వేళ పంట పాడైతే ఆ రసీదుతో నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సూచించిన నాణ్యమైన విత్తనాలనే వాడాలి. రైతులు వరి, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయరాదు.
-గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్
రైతులు ఈ సూచనలు పాటించాలి
- వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.
- బిల్లుపై నంబర్, విత్తన రకం, గడువు తేదీ, డీలరు సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి.
- లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయవద్దు.
- గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయకూడదు.
- కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్‌పై సీల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
- కొన్న విత్తనాలను డీలరు వద్దే తూకం వేయించుకోవాలి.
- మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
- కొనుగోలు చేసిన విత్తన బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలి.
- అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినా సరే బిల్లు తీసుకోవాలి.
- విత్తనాలు కొన్న వెంటనే మొలకశాతం చూసుకోవాలి. మొలక శాతం బాగా ఉండే విత్తనాలనే వాడాలి.
ఫౌండేషన్ విత్తనం
ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. దాదాపు 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. ప్రైవేట్ విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్‌కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు.
విత్తనాలు నాలుగు రకాలు
నాణ్యమైన విత్తనాలు ముఖ్యంగా నాలుగు రకాల్లో లభ్యమవుతాయి. బ్రీడర్, ఫౌండేషన్, సర్టిఫైడ్, ట్రూత్‌ఫుల్ లేబుల్స్‌లో విత్తనాలు లభ్యమవుతాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

