పూలతోట.. లాభాల బాట
పూల తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సీజన్లో మంచి గిరాకీ ఉండడంతో దానిపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ సాగుపై దృష్టి సారించారు.
- ఎకరా పొలంలో.. తక్కువ నీటితో అధిక ఆదాయం
- సీజన్లో మంచి గిరాకీ
- ఉపాధి పొందుతున్న రైతు వెంకటయ్య
కులకచర్ల, జనవరి 19 : పూల తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సీజన్లో మంచి గిరాకీ ఉండడంతో దానిపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ సాగుపై దృష్టి సారించారు. చేమంతి, బంతి, మల్లెపూలు తదితర రకాలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లికి చెందిన వెంకటయ్య గౌడ్ తనకున్న ఎకరా పొలంలో చేమంతి పూలతోటను సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతో ప్రతి ఏడాది చేమంతి పూలతోటను సాగు చేసి సీజన్లో విక్రయిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం..
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ఓవైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది చేమంతితో పాటు రకరకాల పూల తోటలను సాగు చేస్తున్నారు. శివమాలధారులు పూజలకు అధిక సంఖ్యలో పూలను కొనుగోలు చేస్తున్నారు. పెండ్లిళ్ల సీజన్లో మంచి గిరాకీ వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. వేసవిలో పూలసాగు లాభదాయకమని చెబుతున్నారు. గ్రామంలో పూల తోటను సాగు చేస్తూ ఇతర పంటల కంటే అధిక లాభాలను ఆర్జ్జిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
చేతినిండా పని..
పూలతోటల సాగుతో చేతినిండా పని ఉండడంతో పాటు లాభాలు ఆర్జిస్తున్నారు. నిత్యం పూలను కోసి సమీపంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించి మంచి ధరలను పొందుతున్నారు. కిలో పూలు రూ.200 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నది. అలాగే పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు చుట్టుపక్కలా ఉండే గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. పూలు ఎక్కువగా ఉంటే మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. ఇతరులపై ఆధారపడకుండా లాభాలు వచ్చే పంటలను సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపిస్తున్నారు.
ప్రతి ఏటా పూలసాగు
నా కొద్దిపాటి పొలంలో ప్రతి ఏటా చేమంతి పూలతోటను తక్కువ నీటితో సాగు చేస్తున్నాను. అధిక ఆదాయం పొందుతున్నాను. పెండ్లిళ్ల సీజన్‌తో పాటు ఇతర శుభకార్యాల సమయంలో మంచి గిరాకీ ఉంటుంది. అలాగే కులకచర్ల, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు తరలించి పూలను విక్రయిస్తున్నాను.
– ఎముకంటి వెంకటయ్య గౌడ్, ఇప్పాయిపల్లి, కులకచర్ల
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

