మెట్రో వేళలు పొడిగింపు
నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.
- మరో 45 నిమిషాలు పెంపు
- ఇక నుంచిచివరి రైలు 11.45
- ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే..
సిటీబ్యూరో: నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలుకానున్నది. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 నుంచే సర్వీసులు నడుస్తాయి. పొడగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రతి రోజూ 4.5 లక్షల మంది ప్రయాణికులు
నార్సింగిలో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ ఆన్వల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సమ్మిట్-2024 జరిగింది. ఈ కార్యక్రమానికి మెట్రో రైల్ ఎల్ అండ్ టీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరద రాజన్ హాజరయ్యారు. ‘ద మొబిలిటీ ఫర్ టుడే అండ్ టుమారో’ అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రతి రోజూ మెట్రో సేవలను 4.5 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారని, సగటు ట్రిప్ పొడవు 12.5 కిలోమీటర్లు అని వివరించారు. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా మెట్రో సమయాన్ని మరో 45 నిమిషాల పాటు పొడిగించినట్లు వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ‘ద బెస్ట్ గ్రీనింగ్ ద ఫ్యూచర్2023-24’ అవార్డును దక్కించుకున్నది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

