పరిగి, నవంబర్ 11: దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్‌పై దాడికి నిరసనగా పరిగి మండల తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ దాడికి నిరసనగా కార్యాలయ సేవలు నిలిపి వేస్తున్నట్లు తహసీల్దార్ ఆనంద్‌రావు, ఉద్యోగులు పేర్కొన్నారు.
వికారాబాద్: వికారాబాద్ రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్క రించారు. కార్యాలయానికి తాళం వేశారు. నిరంతరం ప్రజల కోసం పని చేసే ఐఏఎస్ అధికారిపై దాడి చేయడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సురేశ్, ఉద్యోగులు సరోజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి: మర్పల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట అధికారులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు అనేక రకాలుగా వారి డిమాండ్ లను నెర వేర్చుకునే హక్కు ఉంది కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యో గులపైన భౌతిక దాడులు అనేవి హేయమైన చర్య అని టీపీఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ రవి శెట్టి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజమల్లయ్య, ఎంపీవో సుశీల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ షఫీ, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు..
ధారూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ షాజిదాబేగం మాట్లాడుతూ కలెక్టర్‌పై దాడి చేయడం తగదని, దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్ఐలు నవీణ, స్వప్న, సిబ్బంది పాల్గొన్నారు.
బంట్వారం: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ కలెక్టర్‌పై దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే కోట్‌పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఎదుట తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
పెద్దేముల్ : తహసీల్దార్ కార్యాలయంలో అన్ని గదులకు తాళం వేసి, విధులను బహిష్కరించి కార్యాలయం ఎదుట కలెక్టర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ బి.వెంకటేశ్ ప్రసాద్ మాట్లాడుతూ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ రిచర్డ్స్ సైమన్, బసంత్ రెడ్డి, అవినాశ్, మహేశ్, శ్రీనివాస్, హరీశ్, భాగ్యలక్ష్మి, లక్ష్మీ,వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్: తహసీల్దార్ కార్యాలయం ఎదుట, అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న కలెక్టర్‌పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు నినా దాలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముంతాజ్, ఆర్ఐలు వాహీ ద్, రాజురెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్లు హారి క, రాధిక, రికార్డు అసిస్టెంట్లు రమేశ్, శ్రీకాంత్, సిబ్బంది మహేశ్, శ్రీను, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పూడూరు: అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి కాని దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని గ్రామ పంచాయతీ కార్యదర్శిల జిల్లా వైస్ ప్రెసిడెంట్ మాణిక్యం పేర్కొన్నారు. కలెక్టర్, ఇతర అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విధులను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మండలలంలోని ఆయా గ్రామ పంచా యతీ కార్యదర్శులు మురళీ కృష్ణ, జహంగీర్, పరుశురాం, శ్రీకాంత్, మల్లేశం ఉన్నారు