కేశంపేట, జులై 18 : మండలంలోని లింగంధన గ్రామంలో నిర్మించ తలపెట్టిన పోచమ్మతల్లి ఆలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ రాంరెడ్డి రూ.1,02,116ను గురువారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు నగదును అందజేసి మాట్లాడారు. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని, మరింత మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో గుమ్మడయ్య, రామస్వామి, కృష్ణయ్య, జంగయ్య, కృష్ణ, సురేందర్, భాస్కర్, బాలస్వామి, ఇస్తారి, బాలయ్య, చంద్రయ్య, బాబు, నర్సింహా, చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, విస్ణు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.