వికారాబాద్, ఫిబ్రవరి 25 : బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఒక కుటుంబం మాదిరిగా పని చేస్తూ ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వికారాబాద్‌లో వార్డులవారీగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు మాజీ కౌన్సిలర్ గోపాల్ ముదిరాజ్‌ను పట్టణ అధ్యక్షుడిగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుభాన్‌రెడ్డి, జనరల్ సెక్రటరీగా గాండ్ల మల్లికార్జున్‌ను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైనవారికి మెతుకు ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయపరుస్తూ పార్టీ పటిష్టతే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. తనపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమించినందుకు మెతుకు ఆనంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, రాష్ట్ర నాయకుడు శుభప్రద్‌పటేల్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అనంత్‌రెడ్డి, షఫీ, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు అశోక్, సీనియర్ నాయకులు దేవదాసు, మల్లేశం, నాయకులు రమణ, అనంతయ్య, సురేశ్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, వికారాబాద్ పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముర్తుజా అలీ, వికారాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గిరీశ్ కొఠారీ పాల్గొన్నారు.