శంకర్పల్లి, ఆగస్టు 6 : ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య రథాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో తన సొంత నిధులతో ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడకూడదని ఆరోగ్య రథాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్య రథంలో అన్ని రకాల రక్త పరీక్షలు, వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. కంటి, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎంత మంది ఉన్నా తాను ఉచితంగా ఆపరేషన్ చేయిస్తానని తెలిపారు. బీపీ, షుగర్ వ్యాధులను అజాగ్రత్త చేయవద్దని సూచించారు. ప్రభుత్వం వైద్యం విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు.
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పేదవారి కోసం ఆరోగ్య రథం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యం చేయించునే స్థోమత లేనివారికి ఎంపీ రంజిత్‌రెడ్డి సహకారమందించడం అభినందించదగ్గ విషయమని.. మండల ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని, అలాంటి ముఖ్యమంత్రికి మనమందరం అండగా నిలువాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్ లలిత, ఏఎంసీ చైర్మన్ పాపారావు, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఎంపీటీసీ నాగేందర్, మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, మండల ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కౌన్సిలర్ శ్రీనాథ్‌గౌడ్, నాయకులు నర్సింహ, అశోక్, శివరాజ్, రాఘవేందర్ పాల్గొన్నారు.