షాద్‌నగర్ రూరల్, నవంబర్ 24 : ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ కులన్మోద హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రాజశేఖర్ కుటుంబాన్ని స్థానిక బీఆర్ఎస్ యువ నాయకుడు రవీందర్‌యాదవ్, నాయకులతో కలిసి పరామర్శించారు. రాజశేఖర్ హత్యకు గల కారణాలను తండ్రి మల్లేశ్, భార్య వాణిని అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర్ హత్య తనను ఎంతో కల్చివేసిందన్నారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రలోభాలు పలుకుతుంది తప్ప ఆచారణలో విఫలమైందని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ హత్య ముమ్మటికీ పోలీసుల వైఫల్యమేనని ఆయన మండిపడ్డారు. పోలీసులు హత్యకు పాల్పడిన వెంకటేశ్‌కు మద్దతు పలికినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. షాద్‌నగర్ ఠాణాలో రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి కోటి రూ పాయలతోపాటు మృతుడి భార్యకు ప్రభుత్వ ఉదోగ్యం, ఇల్లు, భూమిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉం టుందన్నారు. ఆయనతోపాటు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్‌నాయక్, చందు, యాదగిరి, శేఖర్, సత్తయ్య, యువకులు పాల్గొన్నారు.

రాజశేఖర్ హత్య దారుణం
రాజశేఖర్ హత్య చాలా దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రాజశేఖర్ కుటుంబీకులను పరామర్శిం చి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇంకా కుల వ్యవస్థ మారలేదన్నారు. కులమతాల వివక్షలేని సమజాన్ని నెలకొల్పేందుకు ముందుకురావాలన్నారు. రాజశేఖర్ హత్యకు పాల్పడిన నింధితులను, నిర్లక్ష్యంగా వ్యహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులకు బెయిల్ రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, పోలీస్ అధికారులు, ఆర్డీవో సరిత, తహసీల్దార్ నాగయ్యతో ఆయన ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలన్నారు. ఆయన వెంట నర్సింహ, రవి, శ్రీనివాస్ ఉన్నారు.