ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే ఓటరు నమోదును చేపట్టిన ఎన్నికల యంత్రాంగం.. త్వరలో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మరోసారి ఓటరు నమోదు, సవరణను చేపడుతున్నది. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన యువతీయువకులకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ముసాయిదా జాబితాను, ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఓటు నమోదుపై జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. కళాశాలల్లోనే దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతోపాటు బూత్ స్థాయిల్లోనూ బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా, ఇటీవల రూపొందించిన ఓటరు జాబితా ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 35,22,420 మంది ఓటర్లు ఉన్నారు.
Vote | రంగారెడ్డి, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ) : ఓటు హక్కు నమోదు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. త్వరలో గ్రామపంచాయతీ, లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటరు నమోదు, సవరణను చేపడుతున్నది. నాలుగు రోజుల క్రితమే ఇందుకు సంబంధించి న షెడ్యూల్ విడుదలైనది. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ముసాయిదాలో భాగంగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 6న ముసాయిదా జాబితా, ఫిబ్రవరి 8న తుది జాబితాను వెలువరించనున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కొత్త ఓట్ల నమోదు, సవరణలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే పనిలో బీఎల్వోలు నిమగ్నమయ్యారు.
ఓటు నమోదుపై జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించేందు కు అధికారులు సమాయత్తమవుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. కళాశాలల్లోనే దరఖాస్తులను స్వీకరించేలా చర్యలు తీసుకోనున్నారు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతోపాటు బూత్ స్థాయిల్లోనూ బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం చేసుకునే దరఖాస్తులతోపాటు, మార్పులు, చేర్పులు, ఓటు తొలగింపునకు సంబంధించిన దరఖాస్తుల ను సైతం స్వీకరించనున్నారు. ఇంటింటికెళ్లి దరఖాస్తుల పరిశీలించి జనవరి 6వ తేదీన ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటరు జాబితా ప్రకారం.. జిల్లాలో 35,22,420 మం ది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 18,22,366 మంది, స్త్రీలు 16,99,600మంది, థర్డ్ జెండర్స్ 454 మంది ఉన్నా రు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3,27,583 మంది ఓటర్లు, ఎల్బీనగర్లో 5,9,712 మంది, మహేశ్వరంలో 5,46,577 మంది, రాజేంద్రనగర్లో 5,81,937 మంది, శేరిలింగంపల్లిలో 7,32,506 మంది, చేవెళ్లలో 2,62,005 మంది, కల్వకుర్తిలో 2,41,762మంది, షాద్నగర్లో 2,36,338 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ ఓటు ఉన్నదో.. లేదో..! జాబితా ద్వారా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేనివారు, కొత్త ఓటర్లు విధిగా పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరిలో విడుదల చేసే జాబితా నాటికి జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.