బంట్వారం, జనవరి 12: గ్రామీణ యువతను క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి జీపీకి ఒక క్రీడా మైదానం ఉంటే ప్రతి రోజు క్రీడాకారులు, యువత ఆయా క్రీడలలో రాణిస్తారని, అందుక తగ్గట్టు మైదానాల నిర్మాణం చేపట్టింది. ప్రతి మైదానంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ లాంటి ఆటలు ఆడేందుకు అనువుగా మైదానాలను రూపొందించారు.
గత కొన్ని నెలలుగా ఆయా గ్రామాల సర్పంచ్లు మైదా నాల నిర్మాణ పనులు చేశారు. మండలంలో ఇప్పటి వరకు బంట్వారం, బొపు నారం, బస్వపూర్, మద్వపూర్, సల్బత్తపూర్, సుల్తాన్పూర్, మాలసోమారం, రొంపల్లి, తొరు మామిడి, నాగ్వారం, యాచారం గ్రామాల్లో క్రీడా మైదానాలను నిర్మించారు. గ్రామీణ ఉపాధి హామి పథకం నుంచి ఒక్కో మైదానానికి సుమారు రూ రెండు నుంచి నాలుగు లక్షల వరకు నిధులను ఖర్చు చేశారు. ప్రస్తుతం క్రీడాప్రాంగణాలన్నీ క్రీడాకారులు ఆటలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అన్ని సౌకర్యాలతో ఏర్పాటు
ప్రభుత్వం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదిక పనులు చేపట్టాం. ప్ర భుత్వ నిబంధనల మేరకు క్రీడా మైదా నాల్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాం. మైదానం చదును చేయడం, పొదల తొలగింపు, వాలీ బాల్ పోల్స్ ఏర్పాటు లాంటివి చేశాం. ఇప్పటి వరకు మూడు గ్రామాల్లో పనులు పూర్తైనప్పటికీ, మిగతా గ్రా మాల్లో నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిని త్వరలో పూర్తి చేస్తాం.
– సుధాకర్ ఏపీవో, బంట్వారం మండలం.
ఎంతగానో ఉపయోగం…
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్స హించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో క్రీడా మైదా నాల నిర్మాణం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. మైదానాలు లేక పొలాల్లో ఆడు తుండే వారు. ఎకరం స్థలంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మిం టన్, ఖోఖో ఆడే విధంగా ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు.
-లావణ్య సర్పంచ్, బంట్వారం
మానసికోల్లాసానికి…
గ్రామాల్లోని యువకులంతా క్రీడల్లో రాణించాలని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నారు. చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు ఆడుకోవడానికి క్రీడాప్రాంగణాలను ఎంతో ఉపయోగ పడుతాయి. శారీ ర కంగా, మానసికంగా ఎదగడానికి క్రీడా ప్రాంగణా లను విద్యార్థులు, యువకులు ఉపయో గించు కోవాలి
-నాగరాజ్, గ్రామస్తుడు, రొంపల్లి