కడ్తాల్, జనవరి 8 : చెంచు, ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ సంక్షేమాధికారిణి రామేశ్వరీదేవి అన్నారు. జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని చెంచు కాలనీలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో వసతులు, ఇండ్లు, భూములు, ఉపాధి హామీ జాబ్ కార్డులున్నాయా లేదా తదితర విషయాలపై వారు ఆరా తీశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ నెల 15న మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో ఈ పథకంపై ప్రధానమంత్రితో వర్చువల్ మీటింగ్ ఉంటుందని.. కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 11 గ్రామాల్లో ఉంటున్న చెంచులు పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముంతాజ్, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, కోఆపన్ష్ సభ్యుడు జహంగీర్‌బాబా, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, హెచ్‌డబ్ల్యూవో రామచంద్రయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.