తుర్కయంజాల్,ఆగస్టు 20 : మలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో వ్యాధులు దోమల ద్వారానే వ్యాపిస్తాయని కోహెడ పల్లె దావఖాన డాక్టర్ అజిత్ కుమార్ అన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పుస్కరించుకోని బుధవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలోని పల్లె దావాఖానలో ప్రజలకు దోమల వలన కలిగే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భముగా డాక్టర్ అజిత్ కుమార్ మాట్లాడుతూ.. మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ 1897లో గుర్తించారు. అందులో భాగంగా ప్రతి సంవత్సం 20వ తేదిన ప్రపంచ దోమల దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రమ్య, తదితరులు పాల్గొన్నారు.