నందిగామ, ఆగస్టు12 : గ్రామాల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా డీఆర్డీఏ డీపీఎం నర్సింలు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో నందిగామ ఏపీఎమ్ భగవంతు ఆధ్వర్యంలో మహిళా సంఘాల అధ్యక్షులకు, వివోఏలకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. కొత్తగా వృద్ధ మహిళా సంఘాలు, దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వారికి ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గ్రామాలలో సంఘాల్లో లేని వారిని గుర్తించి కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అమృత, అరుంధతి, భాగ్య, సీసీలు రజని, అనురాధ, యాదయ్య, వివోలు, మహిళాసంఘల సభ్యులు పాల్గొన్నారు.