పరిగి, మే 21: నకిలీ విత్తనాలు విక్రయించరాదని కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ హెచ్చ రించారు. మంగళవారం పరిగిలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను మండల వ్యవసా యా ధికారి ప్రభాకర్‌రెడ్డితో కలిసి కొడంగల్ ఏడీఏ శంకర్ రాథోడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాకు, ఇతర వివరాలను ఆయన తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నకిలీవి ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. కొనుగోలు చేసిన వాటికి ప్రతి రైతు రసీదు పొందాలని సూచించారు.
బొంరాస్‌పేట: డీలర్లు రైతులకు ప్యాకెట్లలో కాకుండా లూజు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తాండూరు సహాయ వ్యవసాయ సంచాలకులు రుద్రమూర్తి హెచ్చరించారు. మంగళవారం బొంరాస్‌పేట, తుంకిమెట్ల గ్రామాల్లోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. పలు రిజిష్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు డీలర్ల వద్ద లూజు విత్తనాలు కొనరాదని సూచించారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొన్న రైతులకు డీలర్లు తప్పక రసీదు ఇవ్వాలని, రసీదుపై రైతుపేరు, తండ్రి పేరు, ఊరుపేరు, ధర, ఫోన్ నెంబరు, లాట్ నెంబరు రాయాలని సూచించారు