టీకాలకు వేళాయె
క్యాన్సర్ కంటే భయంకరమైన గాలికుంటు వ్యాధి నుంచి మూగ జీవాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిఏటా రెండుసార్లు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగానే నేటి నుంచి జిల్లాలోని 2,40 లక్షల ఆవులు, ఎద్దులు, 1,25 లక్షల గేదెలు, దూడలకు గాలికుంటు వ్యా ధి, నట్టల నివారణ, ముద్ధచర్మ వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేసేందుకు రంగారెడ్డి జిల్లాలోని పశుసంవర్ధకశాఖ సిద్ధమైనది.
- నేటి నుంచి మూగజీవాలకు గాలి కుంటు, ముద్ధ చర్మ వ్యాధుల నివారణ టీకాల పంపిణీ
- వికారాబాద్ జిల్లాలోని 2,40 లక్షల ఆవులు, ఎద్దులు, 1,25 లక్షల గేదెలు, దూడలకు 52 బృందాలతో అందజేత
ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 30 : క్యాన్సర్ కంటే భయంకరమైన గాలికుంటు వ్యాధి నుంచి మూగ జీవాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిఏటా రెండుసార్లు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగానే నేటి నుంచి జిల్లాలోని 2,40 లక్షల ఆవులు, ఎద్దులు, 1,25 లక్షల గేదెలు, దూడలకు గాలికుంటు వ్యా ధి, నట్టల నివారణ, ముద్ధచర్మ వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేసేందుకు రంగారెడ్డి జిల్లాలోని పశుసంవర్ధకశాఖ సిద్ధమైనది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నుంచి మూగ జీవాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది.
ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి టీకాలను వేయనున్నది. ప్రతి ఆరు నెలలకోసారి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను రైతులు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలికుంటు వ్యాధి టీకాలు వేయించకపోతే కలిగే అనర్థాలను రైతులకు వివరించి వారి లో చైతన్యం తీసుకొస్తున్నారు. జిల్లాలోని 27 మండలాల్లోని అన్ని గ్రామాల్లో గాలికుంటు వ్యాధి టీకాలు వేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు 52 బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజు ల పాటు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగనున్నది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప తెలిపారు.
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
ఆవులు, గేదెలు, ఎద్దులు, దూడలకు సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఉచితంగా గాలికుంటు, ముద్ధ చర్మ వ్యాధి, నట్టల నివారణ టీకాలను పంపిణీ చేయనున్నది. గ్రామాలకు వచ్చే అధికారులకు రైతులు సహకరించి తమ ఆవులు, గేదెలు, దూడలు, ఎద్దులు, ఆవుదూడలకు టీకాలు వేయించాలి.
-అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

