క్షయ వ్యాధి కట్టడి అందరి బాధ్యత
క్షయ వ్యాధి బారినపడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకో వాలని జిల్లా క్షయవ్యాధి ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రవీందర్ యాదవ్ కోరారు.
- బాధితులకు ఉచితంగా మందులు, న్యూ ట్రీషన్ కిట్ల పంపిణీ
- గ్రామగ్రామాన అవగాహన సదస్సులు
పెద్దేముల్, మార్చి 14 : క్షయ వ్యాధి బారినపడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకో వాలని జిల్లా క్షయవ్యాధి ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రవీందర్ యాదవ్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని కందనెల్లి గ్రామ పంచాయతీలో క్షయవ్యాధిపై ఆరోగ్య మేళా(నిక్షయ్ దివస్)కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు క్షయ వ్యాధి (టీబీ) పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న న్యూట్రీషన్ కిట్లను డాక్టర్ బుచ్చిబాబుతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ పుష్పలత,పీహెచ్ఎన్ అరుణకుమారి, ఏఎన్ఎం స్వప్న, పంచాయతీ కార్యదర్శి రమే తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారంపై శ్రద్ధ తీసుకోవాలి
బొంరాస్‌పేట, మార్చి 14 : టీబీ రోగులు పోషకాహారంపై శ్రద్ధ తీసుకోవాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని మండల వైద్యాధికారి డాక్టర్ హేమంత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మేళా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీతో పాటు పలు వ్యాధులపై అవగా హన కల్పించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీబీ రోగికి పోషకాహార కిట్టు అందజేశారు. టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో ఇతరులకు టీబీ సోకుండా ఐఎన్ఎస్ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. రోగులకు మధుమేహం, హైపర్ టెన్షన్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీహెచ్‌వో శివరాజ్, సూపర్వైజర్ మణిమాల, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు
పరిగి మండలంలో..
పరిగి, మార్చి 14: క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని పరిగి మండలం నస్కల్ గ్రామ సర్పంచ్ మేడిద పద్మమ్మ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మేడిద రాజేందర్లు సూచించారు. మంగళవారం నస్కల్ గ్రామంలో జరిగిన అవగాహన సదస్సు లో వారు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణతోపాటు ప్రభుత్వం మందులు అందజేస్తుం దన్నారు. తప్పనిసరిగా వారు పౌష్టికాహారం తీసుకోవాలని వారు పేర్కొన్నారు. కార్య క్రమంలో ఉపసర్పంచ్ ఎం.నాగేష్, ఎంపీహెచ్ఏ ఆరతి, లక్ష్మీ, సుజాత, గ్రామపంచాయతీ కార్యదర్శి ఫారుక్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి మండలంలో..
మర్పల్లి, మార్చి 14 : మండలంలోని కొత్లాపూర్ గ్రామంలో టీబీ వ్యాధిపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పట్లూర్ పీహెచ్సీ డాక్టర్ నేహ తెలిపారు. గ్రామ సర్పంచ్ ప్రభాకర్ టీబీ వ్యాధి గస్తులకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఈవో తిరుపతయ్య, సూపర్వైజర్ అమరేశ్వరి, నరేందర్, రేణుక, వసంతరాణి పాల్గొన్నారు.
ఆరోగ్యమేళాను సద్వినియోగం చేసుకోవాలి
దోమ,మార్చి14; తెలంగాణ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీబీ ఆరోగ్య మేళా ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి శివరామకృష్ణ సూచించారు. మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామ సబ్ సెంటర్లో టీబీ ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని హెల్త్ సూపర్వైజర్లతో కలిసి వైద్యాధికారి శివరామకృష్ణ ప్రారంభించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

