జిల్లాలో పంటల లెక్క వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగుతున్నది. ఏ సర్వే నంబర్లో ఏ రైతు ఏ పంట వేశాడో స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఏఈవోలు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలకెళ్లి ఆయా సర్వేనంబర్లలో వేసిన పంట, రైతుల వివరాలను పూర్తిగా తెలుసుకుని ప్రత్యేక యా ప్లో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాలో మొదటి విడత 81 క్లస్టర్లలోని 1,65,000 డిజిటల్ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు. శాటిలైట్ ద్వారా ఏ రైతు ఏ పంట వేశాడదన్నది సులభంగా తెలుసుకోవచ్చు. దీనిని జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో ఏఈవో సర్వే చేసి పంటల లెక్కలను పక్కాగా నమోదు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద క్లస్టర్‌కు 2000 ఎకరాలను మా త్రమే సర్వే చేయాలని నిర్ణయించారు. అనంతరం ఈ సర్వేను జిల్లాలోని అన్ని గ్రామాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొదటి విడత జిల్లాలోని 81 క్లస్టర్లలోని 1,65,000 ఎకరాల్లో ఈ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వేనంబర్లలోని సబ్డివిజన్లు ,ఎంతమంది రైతులున్నారు. ఏయే పంటలు వేశారనే వివరాలతోపాటు రైతులు, పంటల ఫొటోలనూ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. మొదటి విడత సర్వే పూర్తి కాగానే రెండో విడతలో మరిన్ని గ్రామాల్లో డిజిటల్ సర్వేను ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సర్వేకోసం జిల్లాలో 81 మంది ఏఈవోలు విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో కొనసాగుతున్న డిజిటల్ సర్వేకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఉన్న సర్వేనంబర్లకు వ్యవసాయాధి కారులు వెళ్లినప్పుడు అక్కడి పంట వివరాలను తెలుసుకుని.. పంటలు, రైతుల ఫొటోలు తీసి ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేసేటప్పుడు సిగ్నల్ రాకపోవడం, సర్వర్ డౌన్ కావడం వంటి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని శివా రు మండలాలైన మంచాల, యాచారం, మా డ్గుల, తలకొండపల్లి, కేశంపేట, కొందుర్గు వంటి మండలాల్లో ఈ సమస్య తలెత్తుతున్నది. సరిగ్గా సిగ్నల్ లేకపోవడం డిజిటల్ సర్వేకు అంతరాయంగా మారుతున్నది. సాగుకు యోగ్యం కాని భూముల ను కూడా ఈ సర్వే ద్వారానే అధికారులు గుర్తిస్తున్నారు.
జిల్లాలో పంటల సాగు లెక్కకు సంబంధించిన డిజిటల్ సర్వే ముమ్మరంగా సాగుతున్నది. సర్వేకోసం జిల్లాలోని పైలట్ గ్రామాలను గుర్తించాం. 81 క్లస్టర్ల్లలోని 1,65,000 ఎకరాల్లో పంటల సాగుకు సంబంధించి డిజిటల్ సర్వే చేయాలని నిర్ణయించాం. 81 మంది వ్యవసాయాధికారులు తమకు కేటాయించిన గ్రామాలకెళ్లి ఏ సర్వేనంబర్‌లో ఏ పంట వేశారో గుర్తిం చి రైతులు, పంట ఫొటోలు తీసుకుని ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. త్వరలోనే సర్వేను పూర్తి చేస్తాం.
– నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న డిజిటల్ సర్వేకు సాంకేతిక సమస్యలు ఇబ్బందిగా మారా యి. గ్రామాల్లో పంటల సర్వేను రెండు నుంచి మూడుసార్లు చేయాల్సి వస్తున్నది. సాంకేతిక సమస్యలతోపాటు సిగ్నల్, సర్వర్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి
– శ్రవణ్‌కుమార్, ఇబ్రహీంపట్నం ఏఈవో