పరిగి, అక్టోబర్ 17 : పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు గురువారం పరిగిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. మినీ నుంచి మెయిన్ కేంద్రాలుగా మారిన అంగన్వాడీ కార్యకర్తలకు ఐదు నెలల పెం డింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
2024 జనవరి ఒకటి నుంచి మినీ అంగన్వాడీలను మెయిన్ అం గన్వాడీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసిందన్నారు. మెయిన్ అంగన్వా డీ టీచర్లతో సమానంగా వేతనాలు కేవలం మూడు నెలలే ఇచ్చి ఆ తర్వాత నుంచి ఇవ్వ డం లేదన్నారు. అదేవిధంగా రిటైర్డ్ అయిన అంగన్వాడీ టీచర్లకు రూ.రెండు లక్షలు ఇవ్వాలన్నారు. ధర్నాలో అంగన్వాడీ యూ నియన్ జిల్లా అధ్యక్షురాలు నర్సమ్మ, పరిగి ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, స్వరూప, అంగన్వాడీ టీచర్లు శేత, నిర్మల, కమలాదేవి, శాంతి, సునీత పాల్గొన్నారు.