జై మట్టి గణపయ్య
శుభకార్యాల్లో ప్రథమ పూజలందుకునేది ఆదిదేవుడు వినాయకుడు. ప్రతి ఏటా గణనాథుడి నవరాత్రులను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు.
- మట్టి గణపతే.. మహాగణపతి
- ప్రతిమల తయారీతో ఉపాధి పొందుతున్న యువకులు
- వినాయక చవితికి ముస్తాబవుతున్న మట్టి గణనాథులు పోత్సహిస్తున్న రాష్ట్ర సర్కార్
షాద్నగర్ టౌన్, సెప్టెంబర్ 12 : శుభకార్యాల్లో ప్రథమ పూజలందుకునేది ఆదిదేవుడు వినాయకుడు. ప్రతి ఏటా గణనాథుడి నవరాత్రులను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. ఇందుకోసం పోటాపోటీగా వా ర్డులు, కాలనీలు, గ్రామాల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి చిన్నారుల నుంచి పెద్దల వరకు 11 రోజుల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. అయితే రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యం ఏర్పడుతుం దని, దీంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని భావించిన ప్రభుత్వం మట్టి వినాయకులను ప్రతిష్ఠించేలా ప్రోత్సహిస్తున్నది. దీంతో చాలామంది మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణనాథుల ప్రతిమల బుక్కింగ్తో షాద్నగర్ పట్టణంలో సందడి నెలకొన్నది.
ప్రతిమలకు భలే డిమాండ్ ..
రంగురంగుల గణనాథులకు తీసిపోకుండా వివిధ రూపాల్లో భక్తులను ఆకట్టుకునేలా మట్టి గణపయ్యలను చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నా రు. మట్టి ప్రతిమలు పర్యావరణ పరిరక్షణకు శ్రేయస్కరమని.. మట్టి గణపతే.. మహాగణపతి అని తెలంగాణ సర్కా ర్ అవగాహన కల్పిస్తుండడంతో మట్టి వినాయకుల గిరాకీ పెరిగింది. చాలామంది వాటినే కొనుగోలు చేస్తున్నారు.
రసాయనాల విగ్రహాలొద్దు..
రంగులు, రసాయనాలతో తయారు చేసిన వినాయకుల ప్రతిమలతో నీరు కాలుష్యం అవుతుందని.. చెరువు మట్టి, బంక మట్టితో తయారు చేసిన మట్టి వినాయకులతో నీరు శుద్ధి కావడంతోపాటు నీటిలోని చేప లు, ఇతర ప్రాణులకు ఎలాంటి హాని ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా వివిధ యువజన సంఘా లు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతిఏటా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడంతోపాటు వాటి వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాయి. పు రాణాల ప్రకారం కూడా మట్టి వినాయకులను పూజించడం ఎంతో మంచిదని పురోహితులు ,పండితులు చెబుతున్నారు.
ఉపాధి పొందుతున్న యువకులు
తెలంగాణ ప్రభుత్వం మట్టి వినాయకులను ప్రోత్సహిస్తుండటంతో ఏటే టా మట్టి వినాయకుల కొనుగోలు పెరుగుతున్నది. ప్రస్తుతం మట్టి వినాయకుల ప్రతిమలను తయారీచేస్తూ ఎంతోమంది యువకులు లబ్ధిపొందుతున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని ఆనంద్నగర్కాలనీకి చెందిన మల్లేశ్ గత 13 ఏండ్లుగా బంకమట్టి, చెరువు మట్టి, సాధారణ నీటి రంగులతో 8 ఇంచుల నుంచి 5 ఫీట్ల వరకు మట్టి గణనాథుల విగ్రహాలను తయారీ చేస్తున్నాడు. వీటికి ప్రతిఏటా మంచి డిమాండ్ ఉంటుందని.. భక్తుల అభిరుచులకు అనుగుణంగా ప్రతిమలను రెడీ చేస్తున్నట్లు తెలిపారు.
13 ఏండ్లుగా ఉపాధి పొందుతున్నాం..
13 ఏండ్లుగా మట్టి వినాయకుల ప్రతిమలను తయారు చేస్తూ జీవిస్తున్నా. మా కుటుంబ సభ్యుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నా. మేము తయా రు చేసే ప్రతిమలు నీటిలో తొందరగా కరిగిపోతా యి . నీటిలోని జీవరాశులకు ఎలాంటి హా ని ఉండదు. ఆర్డర్లకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నాం.
-మల్లేశ్, మట్టి వినాయక ప్రతిమల తయారీదారు, షాద్నగర్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

