తుర్కయంజాల్,జూలై 4 : చిన్నతనం నుంచే విద్యార్థులలో దేశం పట్ల గౌరవం కలిగేలా స్ఫూర్తిని నింపాలని ప్రతిరూప(రెప్లికా ఆర్ట్) కళాకారుడు దార్ల నాగేశ్వర రావు అన్నారు. సొమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి ఇంజాపూర్ వేంకటేశ్వర కాలనీలోని అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో మేరా భారత్ మహన్ ఉత్పవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటా జాతీయ జెండా అనే ఉద్దేశంతో మేరా భారత్ మహన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో దేశం పట్ల గౌరవం కలిగేలా స్ఫూర్తిని నింపాలని సూచించారు. అనంతరం ఆయన జెల్ పెన్నుతో భారతదేశ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.