డ్రగ్స్ విక్రయదారులపై.. సైబరాబాద్‌లో డేగ కన్ను
డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా టీ- న్యాబ్ వ్యవస్థ పనిచేస్తుండగా..
- ఇద్దరి అరెస్టు.. రూ. 8 లక్షల డ్రగ్స్ స్వాధీనం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8: డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా టీ- న్యాబ్ వ్యవస్థ పనిచేస్తుండగా.. సైబరాబాద్‌లో ఎస్ఓటీ పోలీసులు సైతం మత్తు మాఫియాకు అడ్డుకట్టవేస్తున్నారు. ఈ క్రమంలోనే పబ్బులకు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 21.788 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 874.316 గ్రాముల గంజాయితో పాటు మారుతీ సీయాజ్ కారు, 2 సెల్ఫోన్లు, 2 డిజిటల్ వెయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వినీత్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
కొండాపూర్ ప్రాంతానికి చెందిన మారం పవన్ కుమార్ అలియాస్ మచ్చ పవన్(31), జొమోటో డెలివరీ బాయ్ ఆదర్శ్ కుమార్ సింగ్(21) డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొంతకాలంగా వీరు కొండాపూర్ శిల్పాపార్కు కాలనీ ప్రధాన రహదారి సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు గురువారం దాడి చేశారు. నిందితులు మారం పవన్‌కుమార్, ఆదర్శ్కుమార్ను అదుపులోకి తీసుకుని, సోదాలు నిర్వహించారు. వారి వద్దనుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి.. ఆ డ్రగ్స్‌ను ఎక్కువ ధరకు నగరంలో విక్రయిస్తున్నారు. నిందితులిద్దరూ నగరంలో ఎవరెవరికీ డ్రగ్స్ విక్రయిస్తున్నారు.. వారు ఎక్కడున్నారు.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిని కూడా గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి..
నగరంలో పబ్స్‌కు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నారని, వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. డ్రగ్స్, గంజాయి ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డయల్ 100, యాంటీ డ్రగ్స్ అభ్యుస్ హెల్ప్‌లైన్ 9492099100, ఎన్డీపీఎస్ ఎన్ఫోర్సుమెంట్ సెల్ 7901105423, సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్లు సైతం తమను సంప్రదిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి.. వారికి సరైన యాంటీ డ్రగ్స్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
Flyover Trolls | తెలంగాణలో బీజేపీపై ఫ్లైఓవర్ల ఫన్నీ ట్రోల్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరదా కౌంటర్లు!
పరిహారం చెల్లించకుండా పనులెలా చేపడతారు? ఓపెన్ కెనాల్ పనులను అడ్డుకున్న బాధిత రైతులు
Supreme Court: నిరసన ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం సరికాదు: సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

