ఇబ్రహీంపట్నం, మే 8 : మరికొన్ని రోజుల్లో వర్షాకాలం పంటల సాగు ప్రారంభమయ్యే నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారించకుండా పంటల మార్పిడి విధానంపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇంకా వృద్ధి చెందే అవకాశమున్నది. దీని నివారణకు రైతులు ఒకేరకమైన పంటలను సాగుచేయటం విధానానికి స్వస్తి చెప్పి పంటల మార్పిడి విధానాన్ని చేపట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వల్ల పొలాల్లో భూసారం తగ్గుతుంది. రోగాలను కలిగించే పురుగుల సంఖ్య బాగా పెరిగి దిగుబడి తగ్గుతుంది. పంటల మార్పిడి వల్ల భూమిలోని పోషకాలు సంవృద్ధిగా అందుతాయి. పంటల మార్పిడితో కలిగే
రైతులు ఒకేరకమైన పంటలు సాగుచేయడం ద్వారా ఆ పంట మొక్కలకు అవసరమైన పోషకాలు తక్కువవుతాయి. రోగకారక పురుగుల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గుతుంది. వరుసగా ఒకే పంటను కాకుండా వివిధ రకాల పంటల సాగుతో పురుగుల జీవిత చక్రాన్ని నిలిపివేయవచ్చు. దాంతో రైతులు మంచి లాభాలను పొందగలుగుతారు. రైతులు ఒకేరకమైన పంటల సాగుకు పూర్తిగా స్వస్తి చెప్పి పంటల మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టడం ద్వారా మంచి లాభాలు గడించే వీలుంటుంది.
-శ్రవణ్‌కుమార్, ఏఈవో