
షాద్‌నగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎలికట్ట శివారులో రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల గ్రామానికి చెందిన రవి (32) అనే వ్యక్తికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరకుని క్షతగాత్రుడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. జరిగిన సంఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.