మొయినాబాద్ : కోడి పందెలు నిర్వహిస్తున్న ఓ ఫామ్‌హౌస్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను పట్టుకుని వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 16మందిని మండల పరిధిలోని ఎల్కగూడ రెవెన్యూ పరిధిలో మహేష్ ఫాంహౌస్‌లో కోడి పందాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు సోమవారం సాయంత్రం ఫాంహౌస్ పై దాడి చేశారు. పోలీసులు దాడి చేయడంతో 5 మంది తప్పించుకోగా 11మంది పట్టుబడ్డారు. శంకర్‌పల్లికి చెందిన చిన్నా అనే వ్యక్తి ఇక్కడ పందాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పట్టుబడ్డ వారిలో వివిధ ప్రాంతాల్లో పని చేసే మేస్రీలు, లేబర్, వాచ్మెన్లు ఉన్నారు. నింధితుల నుంచి రూ. 22,750నగదుతో పాటు 5 మోటరు సైకిళ్లు, 4 పందెం కోళ్లు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నింధితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏఎస్ఐ శైశైలం తెలిపారు.