బంట్వారం : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బొపునారం గ్రామానికి చెందిన ఐనెళ్లి జనార్దన్(30) వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితి బాగలేక, అప్పులు చేశాడు. అప్పులు పెరిగిపోవడంతో, మద్యానికి అలవాటు పడిపోయాడు.
శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లొ ఎవర లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ చెప్పారు. వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.