సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. బిల్డ్ నౌ విధానం ద్వారా పారదర్శకంగా నిర్మాణరంగ అనుమతులను మంజూరు చేస్తున్నామని పైకి చెబుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. నిర్మాణ రంగ అనుమతుల్లో ఆఫీసర్ల కంటే ఆపరేటర్లే కీలకంగా వ్యవహరిస్తూ అక్రమాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. చాలా సర్కిళ్లు, జోన్లలో పర్మిషన్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల నుంచే జరుగుతున్నాయి.
కొన్ని చోట్ల సైట్ విజిట్ నుంచి కలెక్షన్ల వరకు ప్రైవేట్ వ్యక్తులే నడిపిస్తూ అక్రమాలను సక్రమం చేస్తున్నారు. సర్కిల్, జోనల్ లెవల్లో వాస్తవంగా టీపీఎస్, ఏసీపీ, సీపీ, జడ్సీ వరకు దరఖాస్తుల అనుమతులు ఒకరి తర్వాత ఒకరు ద్వారా ప్రాసెస్ జరుగుతున్న ది. కానీ, సదరు ఆఫీసర్ల ప్రమేయం లేకుండానే ఆపరేటర్లు ఫైల్స్ జంప్ చేస్తూ అక్రమ నిర్మాణాల నుంచి అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకు ఆఫీసర్ల లాగిన్ ఐడీలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు.
ఇందుకు రెండు రోజు ల కిందట ఆపరేటర్ అభిలాశ్ బాగోతమే నిదర్శనం. ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్ల లాగిన్లను కొంత కాలంగా తానే ఉపయోగిస్తున్నానని, అదే అలవాటుతో జడ్సీ లాగిన్‌ను వాడేందు కు ప్రయత్నించినట్టు అభిలాశ్ అంగీకరించాడు. ఇక్కడ అభిలాశ్ ఒక్కరే కాదు ఈ తరహా చాలా చోట్ల ఆపరేటర్లు ఆఫీసర్ల లాగిన్‌తో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆఫీసర్ల కనుసైగల్లో నడుస్తున్న అవినీతి ఆపరేటర్లను ప్రక్షాళన చేయడంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల జో క్యం లేకుండా పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని, ఈ ఘటనను విజిలెన్స్ విభాగంతో విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
నిర్మాణ రంగ అనుమతుల జారీలో టౌన్ ప్లానింగ్‌లో కొందరు ఆపరేటర్లు, ప్లానింగ్ అధికారుల అమ్యామ్యాలు మాత్రం ఆగడం లేదు. అర్జీ పెట్టుకోవడమే ఆలస్యం.. అడిగినంత ఇవ్వాల్సిందేనని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. ముడుపులు ముట్టచెబితే చాలు.. నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారని.. అక్రమ నిర్మాణాల ఏరివేత పేరిట నోటీసులు జారీ చేస్తూ ముడుపులు అందుకున్న నిర్మాణాల జోలికి వెళ్లడంలేదనే విమర్శలున్నాయి.
కొందరు ఏపీసీలు స్వతహాగా ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని అక్రమ దందాలకు పాల్పడుతున్నారనే ఆరో పణలున్నాయి. శేరిలింగంపల్లిలో ఓ ఏసీపీ డిపార్ట్మెంట్ ఆపరేటర్‌ను పక్కన పెట్టి సొం తంగా బయటి వ్యక్తిని నియమించుకుని తన ద్వారానే అంతా నడిపిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. తాను ఎక్కడికి బదిలీ అయి నా ప్రైవేట్ సైన్యం తనతోనే ఉంటుందని.. సైట్ విజిట్ నుంచి చేతివాటం వరకు సదరు అధికారికి వారే చక్కబెడుతున్నట్లు పలువురు పేర్కొం టున్నారు.
శేరిలింగంపల్లి తరహాలోనే ఎల్బీనగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి జోన్లలో టీపీఎస్, కొందరు ఏసీపీలు ప్రైవేట్ వ్యక్తులతో పాటు డ్రైవర్లతో దందాలు నడిపిస్తున్న ట్లు ఆరోపణలున్నాయి. కూకట్పల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలోని ఆయా సర్కిళ్ల లో.. జీహెచ్ఎంసీ నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకోవడం లో అధికారులు పూర్తిగా విఫలమవుతుం డడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.