వికారాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో అడవిబిడ్డలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యారు. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం కాగానే వారి అభ్యున్నతికి ఎంతో పాటుపడుతున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వపరిపాలనను వారికే అప్పగించారు. అంతేకాకుండా ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న గిరిజనుల ప్రధాన డిమాండ్ అయిన పోడు భూములకు పట్టాలిచ్చి సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లోనూ మరింతమందికి అవకాశాలు దక్కేలా గతంలో ఉన్న ఆరుశాతం రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచి గిరిజనులకు లబ్ధి చేకూరేలా చేశారు. తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించి వాటి రూపురేఖలను పూర్తిగా మార్చివేశారు.
దీంతో గిరిజనులు సీఎం కేసీఆర్‌కు జై కొడుతున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజనులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకు లు ఎన్ని కుట్రలు చేస్తున్న గిరిజనులు మాత్రం కేవలం ఐదేండ్ల కాలంలోనే తండాల స్వరూపాన్ని పూర్తిగా మార్చిన పట్నం నరేందర్రెడ్డివైపు నిలుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఏ తండాకెళ్లినా ప్రజలు నృత్యాలతో ఘనస్వాగతం పలుకుతూ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు.
అంతేకాకుండా మా తండాలు, మా జీవితాల ను బాగు చేసిన నరేందర్‌రెడ్డినే రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 165 తండాలుండగా..బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకే స్వపరిపాలనను అందించడంతోపా టు అభివృద్ధి వికేంద్రీకరణకుగా ను 46 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. వాటికి అధిక మొత్తంలో నిధులను మంజూరు చేయడం తో రూపురేఖలు పూ ర్తిగా మారాయి. నియోజకవర్గంలోని ఏ తండాకెళ్లి గిరిజనులను పలకరించి నా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మా తండాలకు మంచిరోజులొచ్చా యని..అందుకే రానున్న ఎన్నికల్లో నరేందర్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని చెబుతున్నారు. అంతేకాకుండా గిరిజనుల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు కొడంగల్‌లో రూ.1.50 కోట్లతో గిరిజన భవన్‌ను ప్రభుత్వం నిర్మించింది.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో..రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తండాలకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. వానకాలం వచ్చిందంటే తండాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవి. ఎన్నిసార్లు సౌకర్యాలు కల్పించాలని విన్నవించినా ఫలితం శూన్యం. అయితే కొడంగల్ ఎమ్మెల్యేగా నరేందర్‌రెడ్డి గెలిచిన తర్వా తే ప్రతి గిరిజన తండాకూ రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారు. తండాల్లో రోడ్లను నిర్మించడమే కాకుండా మండల కేంద్రాల నుంచి కూడా తండాలకు లింకు రోడ్లను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల నుంచి తండాలకు, తండాల్లో సీసీ రోడ్ల కు సంబంధించి నియోజకవర్గంలో రూ.62 కోట్ల వరకు ఎమ్మెల్యే వెచ్చించారు. అంతేకాకుండా రూ.కోట్ల నిధు లను ఖర్చు చేసి తండాల్లో బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేశారు.
గిరిజనుల దశాబ్దాల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. పరిపాలన సం స్కరణల్లో భాగంగా నియోజకవర్గంలోని 165 తండాల్లో 46 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. గత ఉమ్మడిప్రభుత్వాల పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండాల్లో ప్రస్తుతం అభివృద్ధి పరుగులు పెడుతున్నది. పరిపాలనాసౌలభ్యం కోసం 500 పైచిలుకు జనాభా ఉన్న తండాల ను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు పరిపాలనను సీఎం కేసీఆర్ అందించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సర్పంచ్‌లు, పాలక వర్గాల సభ్యులు సద్వినియోగం చేసుకుంటూ తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. కేవలం రెండేండ్లల్లోనే వాటి రూపురేఖలు మారిపోవడం హర్షించదగ్గ విషయం. తండాలు ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్లేందుకు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని.. పట్నం నరేందర్‌రెడ్డి గెలిచిన తర్వాతే ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నదని పలువురు గిరిజనులు పేర్కొంటున్నారు. అన్ని గ్రామాల్లో నూ వైకుంఠధామాలు, పల్లెప్రకృతివనాలు, డంపింగ్ యార్డులను నిర్మించారు.
కొడంగల్ మండలంలోని పోచమ్మతండా, మైసమ్మతండా రెండు కలిసి కొత్తగా పోచమ్మతండా గ్రామ పంచాయతీగా ఏర్పాటైన తర్వాతే మా తండా అభివృద్ధి చెం దింది. రెండు తండాల మధ్య రోడ్డులో వాగు అడ్డుగా ఉంటుం ది. వానకాలంలో నీరు పెద్దగా పారినప్పుడు రాకపోకలు నిలిచిపోతాయి. ఎక్క డి వారు అక్కడ ఉండాల్సిందే. కొన్నేండ్లుగా రెండు తండాల మధ్య రోడ్డులో వంతెన నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుసార్లు వినతిపత్రాలిచ్చినా ఫలితంలేదు. కానీ ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 ఎన్నికలకు ముందు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మా తండాకు బ్రిడ్జితోపాటు బీటీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చినట్లుగానే రూ.50 లక్షలు మంజూరు చేసి వాగుపై వంతెనను నిర్మించారు. అదేవిధంగా కొడంగల్ పట్టణం హైవేరోడ్డు నుంచి పోచమ్మతండా వరకు బీటీ రోడ్డు మంజూరు చేసి రోడ్డు వేయించారు. ఇప్పడు మళ్లీ మైసమ్మతండాలో బ్రిడ్జి నిర్మాణంతో తండా వరకు రూ.కోటీ50లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేయించారు. మా గిరిజనుల గోడును వినిపించుకున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దే. రెండు తండాలవాసుల ఇబ్బందులను పరిష్కరించిన ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికే మా మద్దతు.
– గోపాల్‌నాయక్, మైసమ్మతండా, కొడంగల్
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తాగేందుకు నీటికోసం తండా నుంచి దూరంగా ఉండే వ్యవసాయ బోరుబావులు, చెలిమల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. రాత్రి, ఉదయం అని చూడకుండా ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడు వెళ్లి నీటిని తెచ్చుకునేది. పండుగలు, శుభకార్యాల సమయంలో ఎడ్లబండ్లు కట్టుకొని పొలాలకు వెళ్లి తెచ్చుకునేది. ఇంటికి బంధువులు వస్తే వారు వెళ్లే వరకు తిప్పలే. కానీ.. సీఎం కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత నీటి ఇబ్బందులు తప్పాయి. మిషన్‌భగీరథ పథకంతో ఇంటి ముందుకే శుద్ధి చేసిన తాగునీరు వస్తున్నది. రోజు విడిచి రోజు సరిపడా నీరు వస్తున్నది. తండాలో పెద్ద ట్యాంకును నిర్మించడంతో ఎప్పుడూ నీళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి. ఎప్పుడు బంధువులు వచ్చినా నీటి చింతలేదు. ఇలాంటి ప్రభు త్వమే ప్రజలకు కావాలి. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడినే ఎన్నికల్లో గెలిపించాలి. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి.. ఆయన ఉంటేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతా యి. అందరికీ న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటా.
– కమ్లీబాయి, పలుగురాళ్లతండా, కొడంగల్
గుక్కెడు నీటికోసం నియోజకవర్గంలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేసవికాలం వచ్చిందంటే చిన్నాపెద్దా అనే తేడాలేకుండా చేతుల్లో బిందెలు పట్టుకుని కిలో మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావులు, చెలిమల వద్దకు నడుచుకుంటూ వెళ్లి నీటిని తెచ్చుకునేవారు. నీటి కష్టాలతో వారం రోజులకోసారి స్నానం చేసేవారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు గిరిజనుల తాగునీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదు. తమ బాధలను అధికారులకు చెప్పుకుంటే వారు వారానికొకసారి ట్యాంకర్ నీటిని కూడా అందించేవారు కాదని గిరిపుత్రులు పేర్కొంటున్నారు. కానీ.. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకంతో తండావాసుల దాహం తీరింది. ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. గతంలోని కన్నీటి కష్టాలను తీర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికే కొడంగల్ తండాల ప్రజలు జై కొడుతున్నారు.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో గిరిజనులను ఎవరూ పట్టించుకోదు. ఎలాంటి వసతుల్లే కుండానే జీవించాం. పెద్ద కష్టం వచ్చిందంటే అంతే సంగతులు. అనారోగ్యమైతే చాలా దూరంలో ఉన్న దవాఖానలకు ఎడ్లబండ్లపై వెళ్లాల్సి వచ్చేది. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా తండాలకు మంచి రోజులొచ్చాయి. రోడ్లతోపాటు మౌలిక వసతులు కూడా మెరుగుపడ్డాయి. ఇప్పుడు పక్కనున్న తండాలతోపాటు ఇతర ప్రాంతాలకు కూడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వెళ్లి వస్తున్నాం. ఏమైనా సీఎం కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగున్నది. మా గిరిజనులకు అన్ని వసతులు కల్పిస్తున్నది. ఇటువంటి నాయకులు ఉంటేనే మా లాంటి తండాలవాసులు బాగుపడతారు.