కొడంగల్ రోడ్లకు రూ.213.20 కోట్లు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీటీ రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయి.
- బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
బొంరాస్‌పేట, ఫిబ్రవరి 10 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీటీ రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 30 బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.213.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 119 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మించనున్నారు. బొంరాస్‌పేట మండలంలోని మెట్లకుంట నుంచి లోతుకుంట తండా, గుబ్బడి తండాకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.24 కోట్లు, నాగసముందర్ నుంచి దేవనరు.
గుబ్బడి, మహాంతిపూర్, జానకంపల్లి మీదుగా బొంరాస్‌పేట వరకు బీటీ రోడ్డుతో పాటు, మహాంతిపూర్ గ్రామం సమీపంలో కాకరవాణి వాగుపై వంతెన నిర్మాణానికి రూ.23.86 కోట్లు, ఎక్కచెరువు తండాకు రూ.75 లక్షలు, దుద్యాల నుంచి నాచారం మీదుగా అల్లికాన్పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.7.28 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి సంట్రకుంట తండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.89 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బాపన్చెరువు తండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.58 కోట్లు మంజూరయ్యాయి. దౌల్తాబాద్ మండలంలో అల్లాపూర్ నుంచి బండివాడ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.4.16 కోట్లు, తిమ్మారెడ్డిపల్లి నుంచి తిర్మలాపూర్, బానాల మీదుగా నాగసార్ వరకు రోడ్డు, వంతెన నిర్మాణానికి రూ.9.07 కోట్లు, నందారం నుంచి సంగాయపల్లి, కుదురుమల్ల మీదుగా ఇండాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.10.03 కోట్లు, ఇండాపూర్ నుంచి ఈర్లపల్లి మీదుగా ఊరకుంట వరకు రోడ్డు నిర్మాణానికి రూ.7.30 కోట్లు, చంద్రకల్ నుంచి కుప్పగిరి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.5.01 కోట్లు, 163వ నంబరు జాతీయ రహదారి నుంచి బిచ్చాల్ మీదుగా అంతారం వరకు వంతెన, రోడ్డు నిర్మాణానికి రూ.9.93 కోట్లు మంజూరయ్యాయి.
కొడంగల్ మండలంలో హస్నాబాద్ నుంచి చిల్ముల్మైలారం, పలుగురాళ్లతండా మీదుగా ఎక్కచెరువు తండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ.9.59 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి ఖాజాఅహ్మద్‌పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.33 కోట్లు, అంగడిరాయిచూరు నుంచి లక్ష్మీపల్లి మీదుగా సంగాయపల్లి వరకు రోడ్డు, వంతెన నిర్మాణానికి రూ.4.48 కోట్లు, రుద్రారం నుంచి గొట్టిగకలాన్, పాటిమీదిపల్లి మీదుగా గొట్టిగకుర్దు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.22.88 కోట్లు మంజూరయ్యాయి. మిగతా నిధులు నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూరు మండలాల్లో రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

