మోమిన్‌పేట, జూలై 18 : సీఎం కేసీఆర్ పాలన చూసి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేసారం గ్రామ బీజేపీ నాయకులు సతీష్ సుందర్, భిక్షపతి, కరుణాకర్ వారి అనుచరులు 15 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి నచ్చి బీఆర్ఎస్లో వలసలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
25 మంది మైనార్టీ నాయకులు
దోమ : మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో మంగళవారం ఈద్గా భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి 25 మంది మైనార్టీ నాయకులు చేరగా.. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో ఎంఏ రవూఫ్, మహ్మద్ జహంగీర్, స్యాద్ఖాజా, హుస్సేన్, మీర్పాషా, మహ్మద్ అలీ, నయీం భాయ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ మల్లేశ్, ఎంపీటీసీ విజయ, గ్రామ సీనియర్ నాయకుడు మధుసూదన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు సర్ద్దార్, జమీల్, జహంగీర్ ఉన్నారు.
కేసీఆర్ పరిపాలన దక్షతకు ఆకర్షితులై..
పరిగి : సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 30 మంది ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నదన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా కులకచర్ల మండలం నుంచి ఇ.బాబు, ఎస్.బాబు, సురేశ్, వెంకటేశ్, నర్సింహులు, మురళి, లక్ష్మి, మొగులయ్య, కృష్ణయ్య, ప్రశాంత్, ప్రసాద్, వెంకటయ్య, చందు, కృష్ణ, చంద్రమౌళి, వెంకటయ్య, మోత్కూరు అంబేద్కర్ యూత్ నుంచి మోసయ్య, కుస్మసంద్రం నుంచి పానగారి నర్సింహులు, లక్ష్మి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కులకచర్ల మండల అధ్యక్షుడు రాంరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, అంతారం మాజీ సర్పంచ్ మొగులయ్య, కులకచర్ల గ్రామ నాయకులు వెంకటరాములు, బాబయ్య, రాములు పాల్గొన్నారు.