రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకూ ప్రజలకు.. ఆ పార్టీ నాయకులకు నమ్మకం సన్నగిల్లుతున్నది. సోమవారం కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే, షాబాద్ మం డలంలోని కుర్వగూడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి సారథ్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
కడ్తాల్, అక్టోబర్ 6 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతోనే… పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రవి, రామోజీ, శివయ్య, శ్రీశైలం, రామకృష్ణ, మల్లయ్య, పాండు, రవి… మాజీ ఎంపీటీసీ గోపాల్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. హామీల అమల్లో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలను ఇంటింటికెళ్లి ప్రజలకు వివరించాలని శ్రేణులకు సూచించారు. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ రావిచేడ్ గ్రామాధ్యక్షుడు రమేశ్‌యాదవ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్, నాయకులు బాలకృష్ణ, లింగం, జితేందర్‌రెడ్డి, భిక్షపతి, మల్లేశ్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానికంలో సత్తా చాటుదాం..
షాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో కుర్వగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అశోక్‌యాదవ్, రాందాస్యాదవ్, నర్సింహులుయాదవ్, శివరాజ్‌యాదవ్, రాంచంద్రయ్య, శివకుమార్, సదానందం, శివకృష్ణ, మహేందర్, కృష్ణ, శంకరయ్య, రాములు, రాజకుమార్స్వామి, రామస్వామి, రమేశ్, నరేశ్‌కుమార్, నవీన్, శంకర్, నర్సింహులు, మాధవులు, శివ, చంద్రయ్య తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం అమలు కానీ హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలంతా కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణలో రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, సీనియర్ నాయకులు శేరిగూడెం వెంకటయ్య, గడ్డం శ్రీనివాస్, నరేశ్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.