కాంగ్రెస్ నాయకుల అరాచకం
బషీరాబాద్ మండలంలోని నీళపల్లితండాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. కట్టెలు, రాళ్లు, ఇతర మారణాయు ధాల తో దాడి చేశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పను లు, ఇతర సమస్యలపై నిలదీయడంతో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ బాబూనాయక్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు..
- నీళపల్లితండాలో అభివృద్ధి పనులు, ఇతర సమస్యలపై నిలదీస్తుండటంతో..
- బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి
- గాయపడిన ఏడుగురు బీఆర్ఎస్ నాయకులు
- దాడిని ఖండించిన పంజుగుల శ్రీశైల్‌రెడ్డి
తాండూరు, మే 6 : బషీరాబాద్ మండలంలోని నీళపల్లితండాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. కట్టెలు, రాళ్లు, ఇతర మారణాయు ధాల తో దాడి చేశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పను లు, ఇతర సమస్యలపై నిలదీయడంతో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ బాబూనాయక్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు.. బీఆర్ఎస్ నాయకు డు సభావత్ శంకర్‌నాయక్‌తోపాటు ఏడుగురికి గాయాలయ్యాయి. శంకర్‌నాయక్‌కు తల పగిలి తీవ్ర రక్త స్రావమైంది. కాగా, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తండాలో పంచాయితీ పెట్టారు. ఆ సమయంలో వెంకటేశ్‌నాయక్ మాట్లాడుతుండగా కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మణ్‌నాయక్ వచ్చి గుడి దగ్గర మాట్లాడుదామని పేర్కొనడంతో అందరూ అక్కడికెళ్లారు. అప్పుడు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకు లు దాడి చేశారు.
ఇరువర్గాలపై కేసులు..
బషీరాబాద్ పోలీసులకు శంకర్‌నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్‌కు చెందిన బాబూనాయక్, లక్ష్మణ్‌నాయక్, మోహన్‌నాయక్, హద్దూనాయక్, లోక్యానాయక్, బలరాంనాయక్, గోపాల్నాయక్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బాబూనాయక్ ఫిర్యాదుతో బీఆర్ఎస్కు చెందిన మోత్యానాయక్, వెంకట్‌నాయక్, రాజూనాయక్, శాంతీబాయిలపై కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యే బాధ్యత వహించాలి
నీళపల్లితండాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యం లో ఇలాంటి దాడులు అమానుషం. ఈ దాడులకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను హుందాగా స్వీకరించకుండా దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలను పోలీసులు కఠినంగా అణచివేయాలి.
-పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

