 
                                                            వ్యవసాయ యూనివర్సిటీ, అక్టోబర్ 30 : మాయమాట లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికతో భూస్థాపితం కానున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి కార్త్తిక్ రెడ్డి సమక్షంలో సులేమాన్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు ఎండీ జహీరొద్దీన్, డివిజన్ నాయకుడు షేక్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో ముస్లింలు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. సబితాఇంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ముస్లింలకు షాదీముబారక్, కేసీఆర్ కిట్లు వంటి తదితర అనేక సంక్షేమ పథకాలను అడగకుండానే అమలుచేశారని గుర్తుచేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హ యాంలోనే అభివృద్ధి జరిగిందని కార్తిక్‌రెడ్డి అన్నారు. బాధలో ఉన్న మాగంటి సునీతను అవమానపరుస్తున్న కాంగ్రెస్ నేతలకు అక్కడి మహిళలే ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఇబ్ర హీం, అమీర్, నవాజ్, ఇబ్రహీం, షేక్‌బాబా, అశిఫ్ తదితరులు పాల్గొన్నారు.
 
                            