వికారాబాద్, అక్టోబర్ 5 : బీసీలతో కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడిగా కిశోర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అమల్లో అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉన్నదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ద్రో హం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కావాలనే కాలయాపన చేస్తున్నదన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకొస్తున్న ఆర్డినెన్స్‌లు, బిల్లులు, జీవోలన్నీ నాటకాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు బీసీలపై చిత్తశుద్ధే లేదని..ప్రజలను మోసం చేయడంలో ఆయన దిట్ట అని అన్నారు. 42% ఇచ్చిన జీవోను తన అనుచరుల ద్వారా కోర్టు వివాదాల్లోకి లాగి ఎన్నికలను వాయిదా వేయించాలని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని బీఆర్ఎస్ తరఫున ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బీసీ రిజర్వేషన్లు, ఇతరత్రా హామీల అమలుపై కాంగ్రెస్ నాయకులను నిలదీసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు.
కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ అనంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, సీనియర్ నాయకుడు శేఖర్‌రెడ్డి, వికారాబాద్ పట్ట ణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామస్వామి, సురేశ్, పట్టణ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుభాన్‌రెడ్డి, పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముర్తుజాఅలీ, పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు రమణ, వేణుగోపాల్, అనంతరెడ్డి, ఫరీద్, నరసింహ, వరుణ్, రాము తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికుల జేబులకు కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని (ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్) బస్సుల్లో అదనపు చార్జీలను వసూలు చేయడమంటే పట్టణ ప్రజలపై ప్రభు త్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమేనని అన్నారు. ఉపాధి కోసం నిత్యం జంట నగరాల్లో ప్రయాణించే పేదలపై ఈ భారాన్ని మోపడం సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణ యమూ పేదల జేబులను కొల్లగొట్టేలా ఉందని మండిపడ్డారు. ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసీ భారాన్ని మరో రూపంలో సామాన్య ప్రయాణికులపై మోపి వారి నడ్డి విరచాలని చూడడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు.