బషీరాబాద్, జనవరి 8 : ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి రాని అధికారులకు మెమో జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.
ప్రజాప్రతినిధులు సమావేశంలో లేవనేత్తిన ఆంశాలను పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వచ్చే సర్వసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధులు లేవనేత్తిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పంచాయతీ రాజ్ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈపై ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమావేశంలో ఎంపీపీ కరుణాఅజయ్ప్రసాద్ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శాంతబాయి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ పాల్గొన్నారు.