చేవెళ్ల రూరల్, జనవరి 17 : కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మం డలంలోని ముడిమ్యాల్ గ్రామానికి చెంది న 200 కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్థానిక బీజేపీ నాయకుడు గోనె కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి ఆయన కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ముడిమ్యాల్ గేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా, రూ. లక్ష, తులం బంగారం, రూ.4 వేల పింఛన్ వంటి పథకాలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నా రు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రజలు, రైతుల తరఫున పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కార్య క్రమంలో పాల్గొన్న ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కిష్టయ్య అనే వ్యక్తి రేవంత్ సర్కారు చెప్పేవి అన్నీ అబద్ధ్దాలే అని నినదించాడు. అంతలోనే కేటీఆర్.. కిష్టయ్య ఊరుకో లేదంటే రేవంత్‌రెడ్డి జైల్లో వేస్తారని నవ్వులు పూయించారు.
కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూ ద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి ఉన్నా రు. బీఆర్ఎస్లో చేరిన వారిలో నరేందర్‌రెడ్డి, రాంరెడ్డి, దినేశ్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, రాహుల్‌రెడ్డి, శివకుమార్, జంగయ్య, ఎర్రవల్లి, ప్రభాకర్, లక్ష్మయ్య, శేఖరప్ప, రాము లు, సుధాకర్, జంగయ్య, సూరి, రమేశ్, రాములు, సత్తయ్య, శ్రీను, మహేందర్, కృష్ణ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాజు, మహేందర్, నందు, చిన్నా, బాల్‌రాజ్, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, మాజీ సర్పంచ్‌లు హన్మంత్‌రెడ్డి, సులోచనాఅంజన్గౌడ్, మాజీ ఉప సర్పం చ్ వెంకటేశ్, వ్యసాయయ మార్కెట్ కమి టీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, నాయకులు సత్యం, వీరాంజనేయులు, నవీన్, వీరస్వామి, మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.