Shadnagar | షాద్‌నగర్‌టౌన్, మార్చి 26: షాద్‌నగర్ మున్సిపాలిటీలో వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీతా రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటికే ఆస్తి పన్నును వడ్డీ బకాయిలతో చెల్లించినవారికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి జమ చేయడం జరుగుతుందన్నారు. ఆస్తి పన్ను వడ్డీ బకాయిలపై 90 శాతం రాయితీ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఈ నెల 31వరకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.