కేశంపేట, నవంబర్ 21 : ఓ మతానికి చెందిన ఆరాధ్యదైవం గురించి రాజమౌలి అనుచిత వ్యాఖ్యలు చేశారని శుక్రవారం రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేశంపేటకు చెందిన శివాజీ మాట్లాడుతూ వారణాసి సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌలి ఓ మతానికి చెందిన దైవాన్ని కించ పరిచేలా వ్యాఖ్యానించారన్నారు.
ఈ విషయమై రాజమౌలి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమాను బహిష్కరించడంతోపాటు భవిష్యత్తులో రాజమౌలికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.అంజయ్య, కె.నర్సింహా, వెంకటేశ్వర్జీ, కె.మహేశ్, శివగౌడ్, తదితరులు పాల్గొన్నారు.