రంగారెడ్డి, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒకరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీఅండ్‌టీకాలనీ వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వన మహోత్సవానికి ఆయన హాజరై మొకలను నాటారు. అనంతరం దోమల నివారణకు సంబంధించిన ఆయిల్ బాల్స్‌ను నిల్వ నీటిలో వేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
రోడ్లపై నీరు నిలువకుండా, దోమలు పెరగకుండా, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొకలు లేకుండా, శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను భాగస్వామ్యంతో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మద్దెల లతాప్రేమ్‌గౌడ్, కమిషనర్ బి.శరత్ చంద్ర, 7వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య, డీఈఈ యాదయ్య, ఏఈఈ రాజ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు కలెక్టర్ శశాంకతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వనస్థలిపురం ఏరియా దవాఖాన వైద్య సిబ్బందితోపాటు పేషెంట్లకు సంబంధించిన వార్డులను పరిశీలించారు. యాంటీనెటల్కేర్, లేబర్ రూమ్, ల్యాబ్, ఫిజియోథెరఫీ వార్డు, ఆసుపత్రి ఆవరణలో ఉన్న సఖీ కేంద్రం, పారింగ్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు ఏరియా ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి.రాజుయాదవ్, టీఎస్ఎంఐడీసీ అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.