రంగారెడ్డి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శశాంక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 8,008 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. ఈనెల 21 నుంచి 27 వర కు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 1:30 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తారని.. ఆ తర్వాత ఎవరినీ లోనికి అనుమతించారన్నారు. మొదటి పరీక్షకు ఉపయోగించిన హాల్ టికెట్‌ను మిగిలిన ఆరు పరీక్షలకు కూడా వినియోగించాల్సి ఉంటుందని సూచించారు. అభ్యర్థులు నలు పు లేదా నీలం బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిల్, ఎరేజర్‌తోపాటు హాల్ టికెట్‌పై అతికించిన ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదై నా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫొటో ఐడి కార్డును మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి వెంట తీసుకెళ్లాలన్నారు.
అన్ని సమాధానాలను బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే రాయాలని, అభ్యర్థి ఫొటోగ్రాఫ్, సంతకానికి సం బంధించిన చిత్రాలు స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. అభ్యర్థి తమ గ్రూప్-1 సర్వీసెస్ ఆన్లైన్ అప్లికేషన్లో ఎంచుకున్న భాషలోనే అన్ని పరీక్షలు రాయాలని.. ఇతర భాషలో రాస్తే అటువంటి సమాధానాల బుక్లెట్లు మూ ల్యాంకనం చేయబడవన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌పై ముద్రించిన సూచనలను తప్పకుండా చదువాలని సూచించారు.