ఆమనగల్లు,(తలకొండపల్లి) అక్టోబర్ 24 : తలకొండపల్లి మండలంలోని హర్యానాయక్తండాలో బోరుమోటరుకు యువకులు భిక్షాటన చేసి ..వచ్చిన డబ్బుతో మరమ్మతు చేయించిన ఘటనపై రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం స్పందించారు.
ఈ అంశంపై డీపీవో సురేశ్మోహన్ను పూర్తి స్థాయి విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో డీపీవో మంచినీటి ఎద్దడి అంశంపై ఎంపీడీవో, కార్యదర్శులను వివరణ కోరారు. మంచినీటి ఎద్దడి విషయంలో ఎటువంటి రాజీ పడొద్దని ప్రజలను పూర్తిస్థాయిలో అందించాలన్నారు.