చెంచుల జీవనోపాధికి కృషి
చెంచు జాతి ప్రజల జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ నెల 15న ‘పీఎం జన్మన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో అధికారులతో కలిసి మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు.
- ప్రతి లబ్ధిదారుడు, కుటుంబానికి సంక్షేమ ఫలాలు, వసతుల కల్పన
- ఈ నెల 15న అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొనాలి
- సంక్రాంతి పండుగను సెలవుదినంగా భావించకూడదు
- ఆయా శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సమీక్షా సమావేశం
- ఈ నెల 15న చైతన్యనగర్‌లో పీఎం జన్మన్ కార్యక్రమం
పెద్దేముల్, జనవరి 12 : చెంచు జాతి ప్రజల జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ నెల 15న ‘పీఎం జన్మన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో అధికారులతో కలిసి మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడే కార్యక్రమంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
చైతన్యనగర్ గ్రామంలో ప్రతి వ్యక్తి, కుటుంబానికి ఆధార్‌కార్డు, విద్యుత్, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, జన్‌ధన్ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ కార్డులతో పాటు తదితర మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఎవరైనా మిగిలి ఉంటే వారికి సైతం అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగను సెలవుదినంగా భావించకుండా పని చేయాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో తాండూరు ఆర్డీవో శ్రీనివాస్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఇందిరా, డీటీడీడబ్ల్యూవో కోటాజీ, ఎల్డీఎం రాంబాబు, ఈడీఎం మహమూద్ అలీ, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలితాకుమారి, డీఏవో గోపాల్, తహసీల్దార్ కె.కిషన్, ఆర్ఐ రాజురెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వీరేశం, పంచాయతీ కార్యదర్శి నాగరాణి, సర్పంచ్ పి.లలిత, డాక్టర్ బుచ్చిబాబు, లోన్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, ప్రమోద్‌కుమార్, ఫీల్డ్అసిస్టెంట్ వెంకటయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

