మాడ్గుల : బాధితులంతా సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో మాడ్గుల మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులకు చెక్కులను అందజేశారు. రాములుకు రూ. 36వేలు, మల్లయ్యకు రూ. 9వేల చెక్కులు మంజురయ్యాయి. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, నాయకులు గణేష్, రాజులు పాల్గొన్నారు.