పరిగి : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి దేశానికే తలమానికమైన పాలనను అందిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం పరిగిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టినరోజును ప్రజలు సైతం సంబురంగా జరుపుకుంటున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, పలువురు సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.