మంచాల, మే 16 : మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంలో సీఎం కప్ క్రీడోత్సవాలు రెండవ రోజు కొనసాగాయి. ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జగన్‌రెడ్డి, ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
కడ్తాల్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మండల స్థాయి సీఎం కప్-2023 ఆటల పోటీలు కొనసాగుతున్నాయి. వాలీబాల్ ఫైనల్లో మైసిగండి జట్టుపై కడ్తాల్ టీం, కబడ్డీ ఫైనల్లో జడ్పీహెచ్ఎస్ కడ్తాల్ టీంపై కాన్గుబావి తండా జట్టు, ఖోఖో పైనల్లో కడ్తాల్ జట్టుపై మైసిగండి జట్లు గెలుపొందాయి. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, నాయకులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని పెద్దమంగళారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ, ఖోఖో పోటీలను సర్పంచ్ కోట్ల నరోత్తంరెడ్డితో కలిసి ఎంపీపీ నక్షత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, వైస్ ఎంపీపీ మమత, ఎల్కగూడ సర్పంచ్ కుమార్ పాల్గొన్నారు.
యాచారం : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కబడ్డీ పోటీలను ఎంపీడీవో విజయలక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడుతాయని ఎంపీడీవో రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పామెన క్రీడా ప్రాంగణంలో సీఎం కప్ – 2023 క్రీడా పోటీలు రెండో రోజు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. వాలీబాల్‌లో దామరగిద్ద జట్టు గెలుపొందగా, ఆలూరు జట్టు రన్నరప్‌గా నిలిచింది. కబడ్డీలో పామెన జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ఆలూరు జట్టు రెండో స్థానం దకించుకుంది. కార్యక్రమంలో ఎంపీవో విఠలేశ్వర్ జీ, పామెన సర్పంచ్ మల్లారెడ్డి, కందవాడ పీఈటీ కె.శ్రీనివాస రావు , అఫ్రోజ్, సంజీవ్, పంచాయతీ కార్యదర్శులు, సీఆర్పీ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.