కాంగ్రెస్ పాలన అధ్వానంగా మారింది. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చినా.. పల్లెలు, పట్టణాలకు రూపాయి కూడా విదల్చలేదు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వికారాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ప్రతిరోజూ చెత్తను తరలించే ట్రాక్టర్లే తిరగడం లేదు. ఇందుకు కారణం వాటిలో డీజిల్ పోసేందుకు కూడా పంచాయతీ లు, మున్సి పాలిటీలో డబ్బులు లేకపోవడమేనని సమాచారం. దీంతో పారిశుధ్య కార్మికులే ఇంటింటికీ తిరిగి చెత్త ను సేకరించి.. తమ భుజాలపైనే డంపింగ్ యార్డులను తరలిస్తున్నారు.
వికారాబాద్, జూన్ 28 : పల్లెలు, పట్టణాలు శుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామపంచాయతీకి, మున్సిపాలిటీలకు ట్రాక్టర్లను అందజేశారు. అంతేకాకుండా సరిపడా పారిశుధ్య కార్మికులను నియమించి వారికి ప్రతినెలా జీతాలు చెల్లించారు. దీంతో పారిశుధ్య కార్మికులు ఉదయమే ఇంటింటికీ వచ్చి చెత్తాచెదారాన్ని సేకరించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించేవారు. మురుగు కాల్వలను శుభ్రం చేయడం ద్వారా పల్లెలు, మున్సిపాలిటీలు శుభ్రంగా ఉండేవి. నిర్వహణలో ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ప్రతినెలా ప్రత్యేక నిధులను మంజూరు చేసేవారు.
కానీ, 18 నెలల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గ్రహణం పట్టింది. గ్రామాలు, మున్సిపాలిటీలకు రావాల్సిన ప్రత్యేక నిధులు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వికారాబాద్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజూ చెత్తను తరలించే ట్రాక్టర్లే తిరగడం లేదు. దీంతో పారిశుధ్య కార్మికులే ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. తద్వారా వా రికి పని భారం పెరిగిం ది.
పంచాయతీలు, మున్సిపాలిటీల వద్ద నిధుల్లేకపోవడంతో వాటిలో డీజిల్ పోయించలేని దుస్థితి నెలకొన్న ది. మున్సిపల్లో చెత్త ట్రాక్టర్ రాకపోవడంతో పారిశుధ్య కార్మికులు చెత్తాచెదారాన్ని పెద్ద కవ ర్లో కట్టి కర్ర సహాయంతో భుజాలపైనే డంపింగ్ యార్డులను తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు రాకపోవడంతో పాలన కుంటుపడిం ది. ప్రజలు అనే రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పాలన తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్త తరలించే ట్రాక్టర్లు ప్రతి రోజూ నడిచేలా చూడాలని కోరుతున్నారు.