కేశంపేట, ఆగస్టు 28 : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలతోపాటు గణనాథున్ని నిమజ్జనం చేసే వరకు ఎలాంటి డీజేలకు అనుమతి లేదని కేశంపేట సీఐ నరహరి అన్నారు. మండలంలోని డీజే నిర్వహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.
డీజేలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఎవరైనా డీజేపీలను ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వస్తే సీజ్ చేస్తామన్నారు. చెరువులు, కుంటల్లో వినాయకులను నిమజ్జనం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సలహాలు పాటిస్తూ నిమజ్జనం చేయాలన్నారు.